Suhaildev Express train | దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో ఒడిశాలో జరిగిన ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటన మరవకముందే.. రెండు రోజుల క్రితం ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 14 మంది మరణించగా.. వందల మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాజాగా, ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ మధ్య (Delhi – Ghazipur city) నడిచే సుహేల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (Suhaildev Express train ) మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో యూపీలోని ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ ( Prayagraj Station) వద్ద పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని నార్త్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. ‘రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే, ఇంజిన్ రెండు చక్రాలు ట్రాక్ నుంచి పక్కకు పోవడంతో.. ఇంజిన్ వెనుక ఉన్న రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాం. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేదు’ అని ఆయన వెల్లడించారు.
Also Read..
Road Accidents | గతంతో పోలిస్తే 12 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అతివేగం కారణంగానే అధికం
Sachin Pilot | భార్యతో విడిపోయిన సచిన్ పైలట్.. ఎన్నికల అఫడవిట్లో వెల్లడి