గువహటి : అసోంలోని బ్రహ్మపుత్ర నది ( Brahmaputra ) లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జోర్హాత్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవల్లో 100 మంది ఉన్నట్లు సమాచారం. ఒక బోటు మజులీ నుంచి నిమతి ఘాట్‌కు వస్తుండగా, మరో బోటు వ్యతిరేక దిశలో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెండు పడవలు ఢీకొనడంతో.. దాంట్లో ఉన్న ప్రయాణికులతో పాటు బైక్‌లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొందరైతే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పడవలను పట్టుకున్నారు. ఒడ్డుకు చేరేందుకు యత్నించారు.
ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా స్పందించారు. మజులీ, జోర్హత్ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే రంగంలోకి దించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిని సీఎం రేపు విజిట్ చేసే అవకాశం ఉంది.
Sad News: Two boats collided and capsized in Brahmaputra near Majuli, Assam.
— Voice of Assam (@VoiceOfAxom) September 8, 2021
100+ people reported missing.
pic.twitter.com/y6PURXB5zu
देखिए कैसे डूब गई नाँव और बह गए यात्री…
— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) September 8, 2021
Live #video of Boat capsizing after colliding with another boat in river #Brahmaputra in #Assam
Both were ferrying passengers. Many feared missing in Jorhat in #Assam pic.twitter.com/hhhVSjQCk8