న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Punbab DGP)గా సీనియర్ పోలీస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా స్థానంలో ఆయన నియమించారు. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర సర్కారు ఒక ప్రకటన చేసింది. నూతన డీజీపీ నియామకంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతూనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మాదకద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, రోడ్డు భద్రతా ఎన్విరాన్మెంట్ను మెరుగుపర్చడంపై తాను ప్రధానంగా దృష్టి సారిస్తానని సిద్ధార్థ్ చటోపాధ్యాయ తెలిపారు. రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ అవార్డును అందుకున్న ఆయన.. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో తన సేవలందించారు.