చండీగఢ్: ఒక యువతి గర్భందాల్చింది. ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. గర్భవతి అయిన ఆ యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. (Pregnant Woman Killed) మిస్సింగ్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలి ప్రియుడు, అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 21న నంగ్లోయ్ ప్రాంతంలో నివసించే ఏడు నెలల గర్భిణి అయిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది.
కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి పారిపోయే నెపంతో ప్రియుడైన 19 ఏళ్ల సలీమ్ అలియాస్ సంజు, అతడి సహచరులైన 19 ఏళ్ల సోహిత్, పంకజ్ కలిసి గర్భవతి అయిన ఆ యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుసుకున్నారు. ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసి రోహ్తక్లోని మదీనా గ్రామంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
మరోవైపు యువతి ప్రియుడు సలీమ్, పంకజ్‌ను పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. పారిపోయిన సోహిత్ అలియాస్ రితిక్ కోసం నెలన్నర రోజులుగా వెతుకుతున్నారు. అయితే రోహ్తక్లోని సింఘాసన్ బాంక్వెట్ సమీపంలో సోహిత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం ట్రాప్ చేసి అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.