న్యూఢిల్లీ: 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50కు తగ్గించారు. తాజా తగ్గింపుతో వాణిజ్య సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1747.50గా ఉన్నది. గత రెండు వారాలుగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం ఇంధన డిమాండ్ అంచనాలను దెబ్బ తీయడమే ఇందుకు కారణం.
మరోవైపు విమాన ఇంధన(ఏటీఎఫ్) ధరను 4.4 శాతం తగ్గించారు. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.3,954.38 తగ్గి రూ.85,486.80కు చేరింది.