భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్ తయారీకి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దేశ రాజధానిలో వారం క్రితం సుమారు రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇంతలోనే భోపాల్‌లోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం.
మహిళ కడుపులో 2 కిలోల వెంట్రుకలు ;సర్జరీ చేసి తొలగించిన వైద్యులు
లక్నో : తీవ్రమైన కడుపునొప్పితో దవాఖానకు వచ్చిన ఓ మహిళ(21)కు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించగా.. ఆమె పొత్తి కడుపులో 2 కిలోల వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేసి ఆ వెంట్రుకల్ని తొలగించారు. ఈ ఘటన గత నెల 26న ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా దవాఖానలో చోటుచేసుకుంది. బాధిత మహిళకు వెంట్రుకలు తినే అలవాటుందని, ఇదొక మానసిక రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు.