భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్‌కు గాయాలు అయ్యాయి. నిందితుడిని సూర్యాంశ్ కొచార్గా గుర్తించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్సలెన్స్ స్కూల్లో అతను గతంలో చదువుకున్నాడు. మహిళ టీచర్ ఇచ్చిన ఫిర్యాదుతో కసి పెంచుకున్న విద్యార్థి ఆమెపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 3.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. టీచర్ ఇంటికి వెళ్లిన నిందితుడు తనతో పాటు పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లాడు. వార్నింగ్ ఇవ్వకుండానే లేడీ టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారీ అయ్యాడు. బాధితురాలికి 15 శాతం వరకు గాయాలు అయినట్లు తెలిసింది. జిల్లా ఆస్పత్రికి ఆమెను తరలించారు. మంట వల్ల గాయాలు తీవ్రంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
నిందిత విద్యార్థి, టీచర్ మధ్య రెండేళ్ల పరిచయం ఉన్నది. అయితే సూర్యాంశ్ వన్‌సైడ్ ప్రేమను పెంచుకున్నాడు. ఆ స్టూడెంట్ను కొన్ని నెలల క్రితం స్కూల్ నుంచి తరిమేశారు. ప్రస్తుతం అతను మరో స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీచర్ ధరించిన దుస్తులపై అభ్యంతరకర కామెంట్ చేశాడు. ఈ అంశంపై టీచర్ ఫిర్యాదు చేసింది. దీంతో పగ పట్టిన అతను పెట్రోల్ దాడికి ప్లాన్ చేశాడు. ఆ విద్యార్థిపై 124ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. డొంగర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళ్యాణ్‌పుర్ గ్రామం నుంచి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు.