Crime news | తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని మెడపై స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపిన బాలుడు
Crime news | ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై: ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరానీవాడికి చెందిన అబ్దుల్ రహీమ్ మాలిక్ (43).. స్థానికంగా ఉండే ఓ 17 ఏళ్ల బాలుడి తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం ఆమె అబ్దుల్ రహీమ్‌పై లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. పోలీసులు హెచ్చరించి పంపించిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన అబ్దుల్ రహీమ్ ఆ మహిళపై మరోసారి బూతు పదజాలంతో విరుచుకుపడ్డాడు. నోటికొచ్చింది మాట్లాడుతుంటే సదరు మహిళ కొడుకు కూడా అబ్దుల్ రహీమ్‌తో వాదనకు దిగాడు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో బాలుడు ఆగ్రహానికి లోనయ్యాడు.
ఇంట్లో ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకొచ్చి అబ్దుల్ రహీమ్ మెడపైన, తలపైన పొడిచాడు. దాంతో అబ్దుల్ రహీమ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. రహీమ్ భార్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

