మూర్ఛ నాటకమాడి 17 మంది ఖైదీల పరారీ
తమిళనాడులోని తేనీ సబ్-జైలులో 17 మంది ఖైదీలు అనారోగ్య సమస్య ఉన్నట్టు నటించి, జైలు అధికారులపై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఖైదీలను పోలీసులు తిరిగి పట్టుకున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
- గంటల్లోనే 13 మంది పట్టివేత
- ఖైదీల దాడిలో ముగ్గురు అధికారులకు గాయాలు
- తమిళనాడు తేనీ జిల్లాలో ఘటన
చెన్నై : తమిళనాడులోని తేనీ సబ్-జైలులో 17 మంది ఖైదీలు అనారోగ్య సమస్య ఉన్నట్టు నటించి, జైలు అధికారులపై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఖైదీలను పోలీసులు తిరిగి పట్టుకున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కొద్ది నెలల క్రితమే ఏర్పడిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ స్పందిస్తూ తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం గత 30 ఏండ్లలో ఇదే మొదటిసారని అన్నారు. తేనీ జిల్లాలోని ఆండిపట్టి సమీపంలో ఉన్న తెక్కంపట్టి సబ్ జైలు నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయాక 17 మంది విచారణ ఖైదీలు గార్డులపై దాడి చేసి పారిపోయారు. దీంతో అంతర్ రాష్ట్ర గాలింపు చర్యలు వెంటనే చేపట్టగా విధులలో నిర్లక్ష్యం వహించినందుకు 9 మంది జైలు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. విచారణ ఖైదీలందరినీ ఒకే సెల్లో ఉంచారు. వారిలో ఒకరు మూర్ఛ వచ్చినట్టు నాటకమాడాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

