హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇరాన్-ఇజ్రాయెల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో మరో 17 మంది తెలంగాణ వాసులు ఆ రెండు దేశాల నుంచి మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ నుంచి ఐదుగురు, జోర్డాన్ నుంచి ఒకరు, ఇజ్రాయెల్ నుంచి 11 మంది భారత్కు చేరుకున్న వారిలో ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం స్వదేశానికి చేరిన తెలంగాణ వాసుల సంఖ్య 23కు చేరింది. వీరంతా హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.