న్యూఢిల్లీ: వందేమాతరం(Vande Mataram) గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యత, దేశభక్తి, యువతలో ఉత్తేజానికి ఆ గేయం ఇంకా మూలంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ఓ పోస్టు చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7వ తేదీ వరకు వందే మాతరం ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
వందేమాతర గేయం కేవలం పదాల అల్లిక కాదు అని, అది భారత దేశ అంతరాత్మను అందించిన స్వరమన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వందేమాతర గీతం దేశాన్ని ఐక్యంగా నిలిపిందన్నారు. స్వాతంత్య్రోత్సవ జాగరణను బలోపేతం చేసిందన్నారు. మాతృదేశం కోసం అంకితమయ్యేలా, గర్వపడేలా, స్పూర్తి పొందేలా ఆ గేయం విప్లవకారుల్ని ఆకట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదితో మన జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ గేయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి బలమైన స్వరంలో పూర్తి పాటను పాడాలని, భవిష్యత్తు తరాలకు వందేమాతర గేయం ప్రేరణగా నిలుస్తుందని అమిత్ షా తెలిపారు.
వందేమాతర గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ కంపోజ్ చేశారు. సాహిత్య జర్నల్ బంగదర్శన్లో నవంబర్ 7, 1875లో ఈ గేయం పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత 1882లో ప్రచురించిన ఆనందమట్ నవలలోనూ ఈ గేయాన్ని ఆయన పొందుపరిచారు. రబీంద్రనాథ్ ఠాకూర్ ఈ గేయానికి మ్యూజిక్ అందించారు.
‘वंदे मातरम्’ सांस्कृतिक राष्ट्रवाद की प्रथम उद्घोषणा है। ‘वंदे मातरम्’ के 150 वर्ष पूर्ण होने पर @JagranNews में प्रकाशित मेरा लेख।#VandeMataram150 pic.twitter.com/LpW6JYbo1o
— Amit Shah (@AmitShah) November 7, 2025