న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో అత్యధికులు అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారే ఉండటం గమనార్హం. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ డీ కులంతై వేలు కడలూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.