న్యూఢిల్లీ: వీసాలు లేకుండా ఉంటున్న 15 మంది విదేశీయుల్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను డిపోర్టేషన్(Deportation)కు పంపారు. విదేశీయుల్లో ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నారు. బంగ్లాదేశీయులతో పాటు 12 మంది నైజీరియన్లు, ఓ ఐవరీ కోస్టు వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోహన్ గార్డెన్, ఉత్తమ్ నగర్ ఏరియాల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో 15 మంది విదేశీయుల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. ఆ 15 మందిని డిటెన్షన్ సెంటర్‌కు పంపినట్లు చెప్పారు. వెరిఫికేషన్ తర్వాత ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు డిపోర్టేషన్‌కు ఆదేశించింది.