లక్నో, మే 1: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్‌ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుల్తాన్పూర్ జిల్లా బల్దిరాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దరియాపూర్ గ్రామంలో సబీర్ అలీ అనే వ్యక్తి కోళ్లఫామ్ నిర్వహిస్తున్నాడు.
ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో వివాహ ఊరేగింపు ఆయన కోళ్లఫామ్ పక్కనుంచి వెళ్లింది. ఈ ఊరేగింపులో డీజే నుంచి వచ్చిన తీవ్రమైన శబ్దాలకి పౌల్ట్రీఫామ్‌లోని కోళ్లు భయంతో వణికిపోయాయని యజమాని సబీర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సౌండ్‌ను తట్టుకోలేక 140 కోళ్లు మృతి చెందాయని బాధ వెళ్లగక్కాడు. రంగంలోకి దిగిన పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్, ఇంకొందరిపై కేసు నమోదుచేశారు. కోళ్ల మృతికి డీజే సౌండ్ కారణమా? మరేదైనా కారణమా? అనే విషయాన్ని తేల్చనున్నారు.