Girl delivers in hospital toilet | హాస్పిటల్ టాయిలెట్లో ప్రసవించిన బాలిక.. కమోడ్‌లో ఇరుక్కున్న శిశువును రక్షించిన సిబ్బంది
Girl delivers in hospital toilet | ఒక బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నది. అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. కమోడ్‌లో పడేసి ప్లష్ చేసేందుకు ప్రయత్నించింది. కుదరకపోవడంతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది. అయితే రక్తం మరకలు చూసిన కొందరు వ్యక్తులు వైద్య సిబ్బందిని అరెస్ట్ చేశారు.
రాంచీ: ఒక బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నది. అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. కమోడ్‌లో పడేసి ప్లష్ చేసేందుకు ప్రయత్నించింది. కుదరకపోవడంతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది. అయితే రక్తం మరకలు చూసిన కొందరు వ్యక్తులు వైద్య సిబ్బందిని అరెస్ట్ చేశారు. (Girl delivers in hospital toilet) జార్ఖండ్‌లోని గిరిడిహ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గర్భవతి అయిన 14 ఏళ్ల బాలిక సదర్ ఆసుపత్రికి చేరుకున్నది. ఒక వార్డులోని టాయిలెట్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆందోళనతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది.
కాగా, టాయిలెట్ బయట, లోపల రక్తం మరకలు ఉండటాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు గమనించారు. ఏదో జరిగినట్లు అనుమానించి ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ బాలికకు కళ్లు తిరుగడంతో అక్కడ పడిపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి టాయిలెట్‌ను తనిఖీ చేశారు. టాయిలెట్ కమోడ్‌లో ఇరుక్కున్న నవజాత శిశువును గమనించి రక్షించారు. ఆ బాలిక, పసికందును అంబులెన్స్‌లో చైతాడిహ్లోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చడం, శిశువుకు జన్మనివ్వడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

