Bengaluru Rain: బెంగుళూరులో వాన కష్టాలు.. బుక్‌వార్మ్ షాపులో 14 లక్షల ఖరీదైన 5 వేలు పుస్తకాలు ముద్దముద్ద.. వీడియో
Bengaluru Rain: బెంగళూరులో బుధవారం వాన దంచికొట్టింది. దీంతో సిటీ కకావికలమైంది. ఇక ఆ నగరంలోని ఫేమస్ బుక్‌వార్మ్ షాపులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో ఆ షాపులో ఉన్న సుమారు 14 లక్షల ఖరీదైన 5 వేల బుక్స్ తడిసిపోయాయి. మరోచోట వర్షం వల్ల ఓ కాలేజీ గోడ కూలి ఏడు మంది మరణించారు.
బెంగుళూరు: బెంగుళూరులో బుధవారం భీకరమైన వర్షం(Bengaluru Rain) పడింది. వడగండ్లు కూడా ఆ నగరాన్ని ముంచెత్తాయి. అకస్మాత్తుగా భారీ స్థాయిలో వర్షం పడడంతో.. సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక నగరంలోని చర్చ్ స్ట్రీట్‌లో ఉన్న ఫేమస్ బుక్ స్టోర్ ద బుక్‌వార్మ్ షాపు కూడా ఆ వర్ష నీటి ప్రభావానికి గురైంది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. ఆ షాపులో ఉన్న బుక్స్ తడిసి ముద్దయ్యాయి. కొన్ని బుక్స్‌లో స్టోర్‌లోకి చేరిన నీటిలో తేలి ఆడాయి. షాపు ముందు భారీ స్థాయిలో వడగండ్లు పడ్డాయి. బుక్ ప్రేమికులకు ఆ స్టోర్ చాలా స్పెషల్. బుధవారం ఒక్క వర్షానికే సుమారు 14 లక్షల ఖరీదైన 5 వేల పుస్తకాలు ముద్దముద్దయ్యాయి. ఇక బుక్స్‌ను కొనేవారు ఎవరిన దాని ప్రొప్రేటర్ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మర్ సీజన్ కావడంతో.. ఎక్కువ స్టాక్ తెప్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు వర్షం వల్ల ఆ బుక్స్ అన్నీ తడిసి ముద్దైనట్లు తెలిపారు.
ఇక బుధవారం పడిన వర్షం వల్ల బోరింగ్ అండ్ లేడీ కర్జన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్లో గోడకూలింది. ఆ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. దాంట్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురు కూడా గాయపడ్డారు. ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న గోడ కూలి.. రోడ్డు పక్కన నడుస్తున్న వారు, షాపులపై పడినట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.
5000 books, worth over Rs 14 lakh, were destroyed after rain water gushed into The Bookworm (a book shop) on Church Street pic.twitter.com/giVkc0w4gm
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

