లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోచింగ్ సెంటర్(Lucknow Coaching Center)లో జరిగిన అగ్నిప్రమాదం.. సుమారు 14 మందిని బలితీసుకున్నది. లోక్నోలోని అలీఘడ్ ప్రాంతంలో ఉన్న సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం అగ్రిప్రమాద ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ స్పందించారు. ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. భావోద్వేగానికి లోనయ్యారు. తన కండ్లతోనే 14 మంది విగతజీవుల్ని చూసినట్లు ఆయన కన్నీరు పెట్టుకున్నారు. లక్నో కోచింగ్ సెంటర్ ఘటన పట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంవో రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 22, 2026
అగ్నిప్రమాద సమయంలో అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఉన్నది. కోచింగ్ సెంటర్‌తో పాటు ఆ బిల్డింగ్‌లో ఓ పెట్ షాప్, ఇతర స్టోర్స్ ఉన్నాయి. మంటలు వ్యాపించిన తర్వాత కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులు కిందకు దూకినట్లు తెలిసింది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి కింద పడిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిన డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తెలిపారు. కోచింగ్ సెంటర్లో దట్టమైన పొగ కమ్ముకున్నదని, రూముల్లో ఉన్న ప్రతి ఐటమ్‌ను తొలగిస్తూ, అన్ని ప్రదేశాలను చెక్ చేస్తున్నామని తెలిపారు. కోచింగ్ సెంటర్లో ఎక్కువ శాతం వుడెన్ ఫర్నీచర్ ఉన్నట్లు చెప్పారు. కోచింగ్ సెంటర్లో యానిమేషన్ శిక్షణ ఇస్తారని, యానిమేషన్ కోర్సు నేర్చుకునేందుకు ఈ సెంటర్‌కు పిల్లలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు. గాయపడ్డవారిని కేజీఎంసీ ట్రామా సెంటర్‌కు మార్చామన్నారు. పిల్లలు అందరూ 20 ఏండ్ల లోపువారే అని తెలిపారు. ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
#WATCH | On the Lucknow coaching institute fire incident, Uttar Pradesh Deputy CM Brajesh Pathak says, “A total of thirteen children have just been brought out. They have all been sent to the hospital. It is a major incident. There is smoke inside. Every single item is being… pic.twitter.com/M8svb1a2FN
— ANI (@ANI) June 22, 2026