న్యూఢిల్లీ: గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ.1337.76 కోట్ల జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకోసిస్టమ్‌లో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తున్నదని సీసీఐ గురువారం పేర్కొన్నది. ఒప్పందాల్లో తన యాప్‌లను(ప్లే స్టోర్, యూట్యూబ్ వంటివి) ముందస్తు ఇన్స్టాల్ చేయడంతో పాటు, వాటిని అన్ ఇన్స్టాల్ చేసుకొనే అవకాశం లేకుండా చేయడం అన్యాయమని స్పష్టం చేసింది.