బెంగళూరు, సెప్టెంబర్ 17: మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు మంగళవారం రూ.130 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడే విధంగా మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ను క్యాంపస్లోక్యాంపస్లో నెలకొల్పనున్నారు. అకడమిక్ ప్రోగ్రామ్లను ఆఫర్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నది.
దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు!
న్యూఢిల్లీ: భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతున్నది. ఏడాదికి రూ.10 కోట్లు సంపాదిస్తున్న వాళ్లలో.. 63 శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ‘సెంట్రల్ ఇన్స్టిట్యూషనల్ రిసెర్చ్’ తాజా నివేదిక ప్రకారం, 2019 నుంచి 2024 వరకు భారత్లో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఏడాదికి 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న సంఖ్యలో పెరుగుదల 25 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం భారత్లో 31,800 మంది రూ.10 కోట్లకుపైగా వార్షిక సంపాదన కలిగి ఉన్నారు. ఏటా రూ.50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వాళ్ల సంఖ్యలో దాదాపు 10 లక్షల మంది పెరిగారు. రూ.5 కోట్ల సంపాదన (వార్షిక) కలిగిన వారి సంఖ్య 58,200కు చేరుకుంది. ఈ విభాగంలో కోటీశ్వరుల సంఖ్య 49 శాతం పెరిగింది.