న్యూఢిల్లీ: విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ సహా 108 దేశాల్లో మన విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. కెనడాలో 4,27,000, అమెరికాలో 3,37,630, చైనాలో 8580 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు.
భారత పౌరసత్వాన్ని వదులుకున్న 2.16 లక్షల మంది
న్యూఢిల్లీ: భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య భారీగా ఉంటున్నది. 2023లో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ మేరకు వెల్లడించారు.
పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య
2020 – 85,256
2021 – 1,63,370
2022 – 2,25,620
2023 – 2,16,219