న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీలు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు 2014-2021 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో 24 మంది ఎస్సీలు, 41మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ముగ్గురు మైనారిటీ వర్గాలకు చెందిన వారని వివరించారు. అత్యధికంగా సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన 37 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఐఐటీల్లో 34 మంది, ఐఐఎస్సీ బెంగళూరులో 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిపారు.