ముంబై: బృహణ్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో సుమారు 12 వేల కోట్ల కోవిడ్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED Raids) ముంబైలో 15 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. బీఎంసీ ఆఫీసర్లు, సప్లయర్లను ఈడీ టార్గెట్ చేసింది. కోవిడ్ సంబంధిత మౌళిక సదుపాయాలను కల్పించడంలో నిమగ్నమైనవారిపై ఈ దాడి జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇక్బాల్ చాహల్‌ను విచారించారు. ఉద్ధవ్ థాకరేతో సన్నిహితంగా ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు సంజయ్ రౌత్ స్నేహితుడు సుజిత్ పాట్కర్, సూరజ్ చానవ్ ఇండ్లపై తనిఖీలు జరుగుతున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 12 వేల కోట్ల స్కామ్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రెండు రోజుల క్రితం మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే తెలిపారు.