శ్రీనగర్: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వయస్సు సంబంధం లేదని ఓ 120 ఏండ్ల బామ్మ నిరూపించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా దుదు పంచాయత్‌కు చెందిన ధోలి దేవి అనే 120 ఏండ్ల వయస్సున్న బామ్మ శుక్రవారం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీంతో ఒకేరోజు కోటి మంది వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆమె కూడా భాగమయ్యారు. బామ్మ తన ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్న వీడియోను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా శుక్రవారం ఒకేరోజు 1,00,63,931 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటివరకు మొత్తం 62,09,43,580 డోసులను పంపిణీ చేశారు.
VIDEO: 120 year old Smt. Dholi Devi from Dudu Panchayat of district #Udhampur testifies that age is just a number.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 25, 2021
Takes her second dose of #COVID vaccine and thanks PM Sh @NarendraModi, saying “Modi Sahab Ko Namastey”. pic.twitter.com/8DeJT2VkG4