ముంబై, ఆగస్టు 14: బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారం లో ఉన్న మహారాష్ట్రలో ఓటర్ల జాబితా లో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజా గా రెండు జిల్లాల్లో వెలుగుచూసిన అవకతవకలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముంబై సమీపంలో ని పాల్ఘర్ జిల్లాకు చెందిన నాలాసోపారా అసెంబ్లీ నియోజకవర్గం నివసిం చే సుషమ గుప్తా అనే 39 ఏళ్ల మహిళ పేరు ఓటర్ల జాబితాలో ఆరుసార్లు కనిపించింది. ఒక్కో చోట ఒక్కో ఎపిక్ నంబర్‌తో ఆమె ఓటు హక్కును కలిగి ఉండడం విశేషం. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందూ రాణి జాఖఢ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.