న్యూఢిల్లీ, ఆగస్టు 2: కేంద్ర హోం శాఖ, దాని పరిధిలోని సంస్థల్లో 1,14,245 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బుధవారం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ తదితర భద్రతా దళాలు, హోంశాఖలో కలిపి లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఖాళీల భర్తీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. ఈ సంవత్సరంలో 31,879 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని, 1,126 పోస్టులను భర్తీ చేశామన్నారు.