నర్మద నదిలోకి 11 వేల లీటర్ల పాలు!
‘మహాయజ్ఞం’లో భాగంగా ఈ నెల 9న మధ్యప్రదేశ్‌లోని సత్దేవ్ గ్రామం వద్ద నర్మద నదిలోకి 11 వేల లీటర్ల పాలు కలపడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
జబల్పూర్: ‘మహాయజ్ఞం’లో భాగంగా ఈ నెల 9న మధ్యప్రదేశ్‌లోని సత్దేవ్ గ్రామం వద్ద నర్మద నదిలోకి 11 వేల లీటర్ల పాలు కలపడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంత ఎక్కువ పరిమాణంలో ఉండే సేంద్రీయ పదార్థాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను క్షీణింపచేసి, నది జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. మతాచారంలో భాగంగా నది శుద్దీకరణ పేరుతో కొందరు మత గురువులు పాలను నదిలోకి వదిలారు. దీనిపై పర్యావరణ వేత్త అజయ్ దూబే స్పందిస్తూ… ‘ఈ చర్య తాగునీటి కోసం నదిపై ఆధారపడిన స్థానిక సమాజాలపై ప్రభావం చూపుతుంది.
జలచరాలకు, పెంపుడు జంతువులకు కూడా ముప్పు కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. మత పరమైన సమర్పణలు ప్రతీకాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండాలని నొక్కి చెప్పారు. అన్ని వేల లీటర్ల పాలు ప్రభావంతమైన సేంద్రీయ కాలుష్య కారకంగా పని చేస్తాయని మరో పర్యావరణ వేత్త సుభాశ్ పాండే తెలిపారు. 1,312 కిలోమీటర్ల మేర ప్రవహించే నర్మద నది గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కీలకమైన తాగు, సాగునీటి వనరుగా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

