కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 26 : భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 11 మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టా ల సరిహద్దు బీజాపూర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధి కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, కోబ్రా భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో అదే ప్రాంతంలో భద్ర తా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఆరుచోట్ల అమర్చిన మందుపాతరలు పేలా యి. దీంతో పది మంది డీఆర్జీ బలగాలతోపాటు ఓ కోబ్రా జవాన్ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనిని గమనించిన తోటి జవాన్లు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం రాయ్పూర్ దవాఖానకి తరలించారు.