డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్‌నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.