Fire Accident | ఢిల్లీ అలీపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి.
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌లోని దయాల్పూర్ మార్కెట్లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరు అగ్నికీలల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం 5.25 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం గురించి సమాచారం అందింది.
సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, మంటల చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ నిల్వ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ‘పరిశ్రమ పక్కనే ఉన్న నాషా ముక్తి కేంద్రంలోకి మంటలు వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉంది’ అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియదని.. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 11 Died
- Alipur
- Delhi
- Fire accident
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

