Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Cop Rapes Girl | ఒక బాలిక పోలీస్ సహాయాన్ని కోరింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీస్ అధికారి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అధికారి కింద పని చేసే మహిళా ఉద్యోగిని దీనికి సహకరించింది. బాధిత బాలిక ఫిర్యాదుతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పనాజీ: ఒక బాలిక పోలీస్ సహాయాన్ని కోరింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీస్ అధికారి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అధికారి కింద పని చేసే మహిళా ఉద్యోగిని దీనికి సహకరించింది. బాధిత బాలిక ఫిర్యాదుతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (Cop Rapes Girl) ఉత్తర గోవాలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలిక సహాయం కోసం తొలుత బాలల సహాయ కేంద్రాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వికాస్ డేకర్ పరిశీలనకు ఆమె ఫిర్యాదును పంపారు.
కాగా, రిబాందర్లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో జూలై 25, అక్టోబర్ 27 తేదీలలో పోలీస్ ఇన్స్పెక్టర్ వికాస్ డేకర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పోలీస్ అధికారి సహచరురాలైన మహిళా సిబ్బంది రంజినీ పల్యేకర్ దీనికి సహకరించినట్లు బాధిత బాలిక ఆరోపించింది. వారిద్దరిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు దుష్ప్రవర్తన పట్ల పోలీస్ శాఖలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అలోక్ కుమార్ తెలిపారు. నిందితుడైన ఆ పోలీస్ అధికారి, ఆయన సహచరురాలిపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసును ఓల్డ్ గోవా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cop
- Crime Branch Office
- Goa
- help of
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

