ఢిల్లీ కారు ప్రమాద ఘటన.. 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు 11 మంది పోలీసులపై చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించిన రూట్లలో గస్తీ తిరుగుతున్న మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ల సిబ్బందితోపాటు రెండు పోలీస్ పికెట్స్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. డీసీపీ స్థాయి అధికారి సహా 10 మందిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Delhi Accident | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు 11 మంది పోలీసులపై చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించిన రూట్లలో గస్తీ తిరుగుతున్న మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ల సిబ్బందితోపాటు రెండు పోలీస్ పికెట్స్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. డీసీపీ స్థాయి అధికారి సహా 10 మందిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వాళ్లపై శాఖాపరమైన విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. హోంశాఖ ఆదేశాల మేరకు 11 మందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులపై హత్యా నేరం మోపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది.
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

