హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) మీర్జాపూర్ జిల్లాలోల ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మంగళవారం (ఏప్రిల్ 22) రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..కంకర లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బొలేరో వాహనాన్ని ఢీకొనడంతో బొలేరో వాహనంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ట్రక్కు బ్రేకులు ఫేయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందని మీర్జాపూర్ ఎస్పీ అపర్ణా రజత్ కౌశిక్ తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోం దన్నారు. ప్రమాదానికి దారితీసిన సంఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.