న్యూఢిల్లీ: మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 105 ఏళ్ల వ్యక్తిని రిలీజ్ చేయనున్నారు. ఆ కేసును ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. అతనిపై ఉన్న జీవితకాల శిక్షను ఎత్తివేసింది. అతని వయసును దృష్టిలో పెట్టుకుని సుప్రీం తన తీర్పును వెలువరించింది. బెంగాల్లోని మాల్దా జిల్లాలో 1920లో రసిక్ చంద్ర మోండల్ అనే వ్యక్తి జన్మించాడు. 1994లో అతను 68 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మర్డర్ కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో 2024 నవంబర్ 29 వరకు జైలులో ఉన్నాడు. ఆ ఏడాది అతనికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. అయితే ఆకేసును మూసివేస్తున్నట్లు శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఒకవేళ అతనికి జీవితకాల శిక్ష పూర్తి కాకున్నా, అతన్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోబోరు అని సీజేఐ అన్నారు. 2024 నాటి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులనే తుది ఆదేశాలుగా మార్చేశారు. మోండల్కు వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. 2018లో కోల్కతా హైకోర్టు మోండల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 2020లో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. వయసు రీత్యా రిలీజ్ చేయాలని వేడుకున్నారు.