ముంబై : మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది. ఆమెను 20 రోజుల క్రితం ఈ ప్రైవేట్ దవాఖానకు తీసుకొచ్చారు. ఆమెకు డాక్టర్ ఉష గజ్భియే వైద్య పరీక్షలు చేసి, కౌన్సెలింగ్ చేశారు.
అప్పుడు ఆ బాలిక తనకు జుట్టును తినే అలవాటు ఉందని తెలిపింది. ఆ జుట్టు కడుపులో ఓ బంతి మాదిరిగా చుట్టుకుని ఉందని పరీక్షల్లో తేలింది. సర్జరీతో దానిని తొలగించాక బాధితురాలు ఇప్పుడు ఆహారం సక్రమంగా తింటున్నది.