న్యూఢిల్లీ: గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడు మూత్రశాలలో పొగతాగుతూ పట్టుబడ్డాడని, మరో ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలు మూత్రశాలకు వెళ్లినప్పుడు ఆమె దుప్పటిని ఉపయోగించుకున్నాడని వివరించింది.