Boiler Explodes : ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఘోర ప్రమాదం పది మందిని పొట్టనబెట్టుకుంది. వేదాంత లిమిటెడ్ విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలిన(Boiler Explodes) ఘటనలో10 మంది మృతి చెందగా.. నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. సింఘితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో మధ్యాహ్నం సమయంలో బాయిలర్ పేలింది. బాయిలర్ పేలడంతో భయపడిన కొందరు కార్మికులు పవర్ ప్లాంట్‌లోనే చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం శక్తి జిల్లా సింఘితరాయ్ గ్రామంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో మధ్యాహ్నం సమయంలో బాయిలర్ ట్యూబ్ పేలింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ ఘటనలో పది మంది చనిపోగా.. 40 మంది గాయపడ్డారని, మరికొందరు ప్రాణ భయంతో విద్యుత్ ప్లాంట్‌లోనే చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు.
Raigarh, Chhattisgarh: On the Vedanta power plant accident, SSP Shashi Mohan Singh says, “Due to the incident at the Vedanta plant, 30 people have been brought to our district in injured condition…” pic.twitter.com/HX8UOXuHXr
— IANS (@ians_india) April 14, 2026
‘దురదృష్టవశాత్తూ ఏప్రిల్ 14 మధ్యాహ్నం సింఘితరాయ్ విద్యుత్ ప్లాంట్‌లో ఒక బాయిలర్ యూనిట్ పేలింది. ప్రస్తుతం మా తొలి ప్రాధాన్యం గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించడం. ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయాన్ని ఆరా తీస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. బాయిలర్ పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
‘ఛత్తీస్‌గఢ్‌లో శక్తి జిల్లాలోని పవర్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధుల నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు నష్టపరిహారం అందజేస్తాం’ అని మోడీ పేర్కొన్నారు.