లక్నో: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టింది. (Van collides with bus) ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం ఘజియాబాద్ నుంచి సంభాల్ వెళ్తున్న పికప్ వ్యాన్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. బుదౌన్-మీరట్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా 27 మంది గాయపడ్డారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసం కాగా బస్సు ముందు భాగం దెబ్బతిన్నది.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
बस और मैक्स गाड़ी की आमने-सामने की टक्कर
मैक्स में सवार थे 25 यात्री,कई यात्रियों की बताई जा रही है मौत
मृतक लोगों शवों को कब्जे में लेकर पुलिस ने पोस्टमार्टम के लिए भेजा
गुस्साए लोगों ने रास्ते को किया चक्का जाम
सलेमपुर थाना क्षेत्र का मामला।#Bulandshahr pic.twitter.com/1xL48E68Jh
— News 24 Bharat || न्यूज़ 24 भारत (@News24Bharattv) August 18, 2024
उत्तर प्रदेश के बुलंदशहर में भीषण सड़क हादसा.
बस और पिकअप की टक्कर में 3 लोगों की मौत, 21 घायल #RoadAccident | #Bulandshahr pic.twitter.com/IGZwoR80Lb
— Dainik Live (@Dainik_Live) August 18, 2024