Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ పవర్‌ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి.. 40 మందికి గాయాలు
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ పేలిన ఘటనలో 10 మంది మరణించగా, 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ పేలిన ఘటనలో 10 మంది మరణించగా, 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్, శక్తి జిల్లా, సింగితారి గ్రామ సమీపంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ ఉన్నట్లుండి పేలిపోయింది.
ఘటన జరిగినప్పుడు చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల పని చేస్తున్నారు. ఈ పేలుడు భారీగా ఉండటంతో అక్కడ పని చేస్తున్న కార్మికుల్లో 10 మంది మరణించారు. మరో 30 నుంచి 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది. పేలుడు జరగడంతో అక్కడి కార్మికులు పారిపోయేందుకు ప్రయత్నించగా, ఇంకొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

