న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్, ట్రాన్స్ఫర్ పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 13 బెంచ్‌లు పనిచేస్తున్నాయని, ప్రతి రోజు ఒక్కొక్క బెంచ్ పది బెయిల్ కేసులతో పాటు ట్రాన్స్ఫర్ పిటీషన్లను విచారించాలని సీజేఐ పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం ఈ కేసుల విచారణను చేపట్టాలని, పెండింగ్ కేసులన్నీ డిసెంబర్‌లోని క్రిస్మస్ సెలవుల లోపు పూర్తి చేయాలని సీజే తెలిపారు. సీజే చంద్రచూడ్ ప్రకారం సుప్రీంకోర్టులో సుమారు మూడు వేల ట్రాన్స్ఫర్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.