లాహౌల్: అటల్ టన్నెల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం(Bus Overturns)లో ఒకరు మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. రోహతంగ్ పాస్ సమీపంలోని గుంధీ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు అంతా ముంబైకి చెందిన వాళ్లు అని మనాలీ డీఎస్పీ కేడీ శర్మ తెలిపారు. డ్రైవర్ అదుపు తప్పడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో డ్రైవర్‌తో కలిపి 21 మంది టూరిస్టులు ఉన్నారు. దాంట్లో ఒకరు మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు.