Stone Mine Collapse | కుప్పకూలిన క్వారీ.. ఒకరు మృతి, శిథిలాల కింద చిక్కుకుపోయిన 15 మంది కార్మికులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో సోన్‌భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో సోన్‌భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది. దీంతో ఒకరు మరణించారు. సుమారు 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
క్వారీలోని ఒక గోడ కూలడం వల్లే కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. అందులో కొంతమంది శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారని తెలిపారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్), ఎస్పీతో పాటు అధికారులు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అదపు యంత్రాలు, సామాగ్రిని తెప్పించామని తెలిపారు.
#WATCH | Sonbhadra, UP | Visuals from the spot where around 15 people are feared trapped after a stone mine collapsed yesterday in Sonbhadra. NDRF and SDRF teams are at the spot. One body has been recovered. Rescue operations are underway.
(Source: NDRF) pic.twitter.com/0l7E4JL3kc
— ANI (@ANI) November 16, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

