Agriculture | వ్యవసాయం అంతంతే.. రైతుల ప్రధాన డిమాండ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు
- పరిశోధనలు, ఉత్పాదకత పెంపుపై ప్రధానంగా దృష్టి
- ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు
- త్వరలో 109 వంగడాలు
Agriculture | న్యూఢిల్లీ, జూలై 23: కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలపై సమగ్ర సమీక్ష చేస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొనేలా కొత్త వంగడాలను సృష్టించడంపై దృష్టి పెట్టనున్నామని వెల్లడించారు. వేరుశెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని తెలిపారు. రానున్న రెండేండ్లలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తామని, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, సర్టిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు, స్థిరమైన సరఫరా కోసం భారీ కూరగాయల ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
డిజిటల్ ఫ్రేమ్‌వర్క్ సదుపాయం
అధిక దిగుబడి ఇచ్చే, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే 109 కొత్త వంగడాలను రైతుల కోసం విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. అలాగే నూనె గింజల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేసేందుకు 10 వేల బయో ఇన్పుట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాతావరణ సమాచారం, పంటకు సంబంధించిన సలహాలు, మార్కెట్ ధరలకు సంబంధించిన కీలక సమాచారం ఈ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా రైతులకు తెలుస్తుందని పేర్కొన్నారు. రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని, సహకార రంగం అభివృద్ధి కోసం జాతీయ సహకార విధానాన్ని తీసుకొస్తామని బడ్జెట్లో ప్రకటించారు.
‘కేంద్రీకరణను మరింత ముందుకు తీసుకుపోయేందుకు, రాష్ర్టాల సమాఖ్య హక్కుల ఉల్లంఘనను కొనసాగించేలా ఈ బడ్జెట్ ఉన్నది. వ్యవసాయ సంబంధిత దోపిడీ వ్యాపారంలో లాభాలను పెంచేలా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ వైపు నడిపించేలా పద్దు కనిపిస్తున్నది’
– ఆలిండియా కిసాన్ సభ
రైతులకు మొండి చేయి
‘రైతుల ప్రధాన డిమాండ్లను పట్టించుకోలేదు. ఇది దేశ రైతాంగానికి మొండిచేయి చూపిన బడ్జెట్. పర్యావరణ మార్పుల పేరుతో వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం ప్రైవేట్ సెక్టార్‌కు నిధులు కేటాయించడం ఆందోళనకరం’
– రాకేశ్ టికాయిత్, రైతు నేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

