న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కనిపించింది. ఇదే క్రమంలో తాము జాతీయ గీతాన్ని (National Anthem) పాడుతున్న వీడియోలను ఎందరో భారతీయులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రికార్డు సృష్టించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 14 న.. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి రికార్డు చేసి పంపించాలని సూచించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెబ్సైట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. లక్షల మంది సంతోషంగా పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది భారతీయులు ‘జన గణ మన’ గీతాన్ని పాడి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు, నటీనటులు, ప్రసిద్ధ పండితులు, అగ్ర నాయకులు, సీనియర్ అధికారులు, సైనికులు, ప్రముఖ క్రీడాకారులు, జర్నలిస్టులు.. ఇలా ఎందరో జాతీయ గీతాన్ని ఆలపించడానికి ముందుకు వచ్చారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న తమ వీడియోలను అప్లోడ్ చేసి తమ ఐక్యతను ప్రదర్శించారు. దాంతో పెద్ద ఎత్తున వీడియోలో సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యాయి. జాతీయ గీతాన్ని ఆలపించే ఈ కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బలమైన ఐక్యత సందేశాన్ని పొందింది అని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
ముంబై ఇండియన్స్‌కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
లండన్‌లో క్రికెటర్ల జెండా పండుగ
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..