శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 27, 2021 , 17:56:12

11 లక్షల పీఎం కిసాన్‌ నగదు బదిలీలు విఫలం

11 లక్షల పీఎం కిసాన్‌ నగదు బదిలీలు విఫలం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 23 నుంచి జూలై 31 వరకు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో 11.2 లక్షల సంఖ్యలో  పీఎం కిసాన్‌ నిధులు రైతుల బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ కాక విఫలమయ్యాయి. వీటిలో 56 శాతం మేర నగదు బదిలీలను తర్వాత పునరిద్ధరించగా మిగతా 44 శాతం లబ్ధిదారులు పీఎం కిసాన్‌ నిధులు పొందలేకపోయారు. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా ఈ విషయం తెలిసింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రతిఏటా రూ.6 వేల నగదును పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో జమ చేస్తుంది. 

అయితే లాక్‌డౌన్‌ సమయంలో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 64.55 శాతం (7,29,000) మేర పీఎం కిసాన్‌ నగదు బదిలీలు విఫలమయ్యాయి. 7.54 శాతం (85,000) నగదు బదిలీల వైఫల్యంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా 55 వేల విఫల బదిలీలతో కర్ణాటక, 51 వేల విఫల బదిలీలతో బీహార్‌, 48 వేల విఫల బదిలీలతో ఉత్తర ప్రదేశ్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 86 శాతం మేర పీఎం కిసాన్‌ నగదు బదిలీలు విఫలమైనట్లు ఆర్టీఐ కార్యకర్త వెంకటేష్‌ నాయక్‌ తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo