Ponzi Scam | అహ్మదాబాద్, నవంబర్ 27: బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో భారీ కుంభకోణం బయటపడింది. ఉత్తర గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో 6,000 కోట్ల పోంజీ స్కామ్ వెలుగుచూసినట్టు సీఐడీ ప్రకటించింది. ఈ కుంభకోణ ప్రధాన నిందితుడు బీజేపీ నేత అని, అతను పరారీలో ఉన్నాడని తెలిపారు. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని చెప్పిన మాటలు నమ్మి వేలాది మంది ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయారు.
ఈ కుంభకోణం కనీసం ఏడు జిల్లాలకు వ్యాపించినట్టు పోలీసులు తెలిపారు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ బృందాలు సబర్కాంత, మరో ఆరు జిల్లాల్లోని బీజే ఇంటర్నేషనల్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాడులు నిర్వహించాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన సంస్థ సీఈవో భూపేంద్రసిన్హ్.. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ టికెట్‌కు ప్రయత్నించాడని బాధితులు తెలిపారు.