న్యూఢిల్లీ: మిస్ ఇండియా కిరీటాన్ని పొందినవారి జాబితాను తాను పరిశీలించానని, అందులో కనీసం ఒక దళిత లేదా ఆదివాసీ యువతి అయినా లేరని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన శనివారం ప్రయాగ్ రాజ్‌లో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మిస్ ఇండియా’ పోటీలు, సినిమాలు, క్రీడల్లో రిజర్వేషన్లు ఉండాలని రాహుల్ కోరుకుంటున్నారని, ఇది కేవలం పసితనపు మనస్తత్వం వల్ల వచ్చిన సమస్య మాత్రమే కాదని, ఆయనను ప్రోత్సహిస్తున్నవారు కూడా సమానంగా బాధ్యులేనని వ్యాఖ్యానించారు.