న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఒకే రకమైన కండోమ్‌ను (యూనిసెక్స్ కండోమ్) మలేసియాకు చెందిన గైనకాలజిస్టు జాన్ టాంగ్ ఇంగ్ చిన్ తయారు చేశారు. ఇలాంటి కండోమ్ ప్రపంచంలో ఇదే మొట్టమొదటిదని భావిస్తున్నారు. గాయాలు అయినప్పుడు డ్రెస్సింగ్ కోసం వాడే మెడికల్ మెటీరియల్‌తో ఈ కండోమ్‌ను తయారు చేసినట్టు టాంగ్ చెప్పారు. దీనిని పురుషులు, మహిళలు ఇద్దరూ వాడవచ్చని తెలిపారు. ఈ కండోమ్‌లను వండాలీఫ్ సంస్థ డిసెంబర్ నుంచి కమర్షియల్‌గా మార్కెట్లోకి తీసుకురానున్నది. ఒక్కో కండోమ్ ధర దాదాపు రూ.140.