న్యూఢిల్లీ: నౌకాదళం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. శత్రు దేశాల జలాంతర్గాములను సైలెంట్‌గా వెంటాడే యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ మాహె’ నౌకాదళంలో చేరింది. సోమవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ‘ఐఎన్ఎస్ మాహె’ను నౌకాదళానికి అప్పగించారు.
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ని ర్మించిన ఐఎన్ఎస్ మాహెలో 80శాతం స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలంట్ హంటర్‌గా పిలుచుకునే ఈ నౌక పశ్చిమ సీబోర్డ్ ఆధీనంలో కార్యకలాపాలు సాగించనున్నది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహె పేరును ఈ నౌకకు పెట్టారు.