న్యూఢిల్లీ: జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూ ర్యకాంత్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈనెల 9న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను విడుదల చేసిందని నల్సా ఓ ప్రకటనలో తెలిపింది.
అణగారిన, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు న్యాయం అందుబాటులో ఉండటంతోపాటు, ఉచిత న్యాయ సహాయం అందాలనేది నల్సా లక్ష్యమని తెలిపింది. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో ప్రస్తుతం జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్నారు. ఆయన ఈ నెల 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్ సూ ర్యకాంత్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీకి చైర్మన్గా ఉన్నారు.