న్యూఢిల్లీ: ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా శాంపిళ్లలో ఇథిలీన్ ఆక్సైడ్ ఆనవాళ్లు కనిపించలేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు బుధవారం వెల్లడించారు.
ఈ రెండు కంపెనీలకు చెందిన వివిధ రకాల మసాలా, కర్రీ పౌడర్లలో పరిమిత స్థాయికి మించి ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్టు పేర్కొంటూ హాంకాంగ్, సింగపూర్, నేపాల్, మాల్దీవ్స్ తదితర దేశాలు వాటి అమ్మకాలను, దిగుమతులను నిషేధించిన విషయం విదితమే. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆయా మసాలా పౌడర్ల శాంపిళ్లను సేకరించి, 28 అక్రెడిటెడ్ ల్యాబొరేటరీల్లో పరీక్షించింది.